ADB: బాసర IIITకి ఎంపిక అయినా కోమలి, శృతి అను విద్యార్థులను మంగళవారం కౌట(బి) వీ.డీ.సీ.తరపున జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కౌట (బి)లో సన్మానించి, ప్రైజ్ మనీ, మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా వీ.డీ.సీ.అధ్యక్షులు పిడుగు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానంచేసి, ప్రైజ్ మనీ షీల్డ్ అందజేయడం జరుగుతుందన్నారు.