TG: ఉద్యమకారులను గుర్తించేందుకు కేకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈనెల 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో నిర్వహించనున్న సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది.