AP: పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో TDPలో ప్రతి ఒక్కరూ పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈనెల 4న జరగనున్న NDA సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్లు కంటే, వచ్చే ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలని ఆదేశించారు.