AP: రాజధాని అమరావతి పేరుతో స్కామ్‌లు జరుగుతున్నాయని YCP అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారని, మళ్లీ ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారని విమర్శించారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. భవిష్యత్తులో APకి రాజధాని లేకుండా చేయాలని TDP కుట్ర చేస్తోందని ఆరోపించారు.