వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను విదేశాల్లో జరిగే సిరీస్‌ల కోసం ఇప్పుడే ఎంపిక చేయవద్దన్నాడు. ముందుగా IPL తరహా పిచ్‌లు ఉండే ఉపఖండ దేశాల్లో మాత్రమే ఆడించాలన్నాడు. కెరీర్ ఆరంభంలోనే 15 ఏళ్ల పిల్లోడిని కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టడం సరైనది కాదని పేర్కొన్నాడు.