MNCL: నెన్నెల మండలం నందులపల్లిలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న VOA భవనానికి సర్పంచ్ కెమెరా వనిత శంకర్ మంగళవారం భూమిపూజ నిర్వహించారు. MLA వినోద్ చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ఈ భవనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ గజేందర్ సింగ్, వీవోఏ అధ్యక్షురాలు దుర్గం సునీత, కార్యదర్శి సరిత పాల్గొన్నారు.