TG: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో మూడోరోజు శ్రీసుదర్శన మహామంత్ర హోమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 9 వరకు చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ పూజలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమాలు, పారాయణాలు నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు నేరుగా రావడంతో పాటు ఆన్లైన్ ద్వారా కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.
అధిక మాసంలో వచ్చే పౌర్ణమికి ఆధ్యాత్మికంగా రెట్టింపు విశిష్టత ఉంటుంది. ఇవాళ అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన నదీస్నానం, దీపదానం, అన్నదానం చేయడం అత్యంత శ్రేష్ఠం. ముఖ్యంగా పితృ దేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారికి అక్షయ పుణ్యలోకాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండి శిలాతోరణం వరకు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
AP: తిరుమల శ్రీవారి దర్శనం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను TTD విడుదల చేసింది. ఈసారి 4,40,050 టికెట్లను అందుబాటులో ఉంచింది. అలాగే తిరుమలలో వసతి గృహాల బుకింగ్ టోకెన్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు TTD అధికారిక https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
AP: తిరుపతిలోనే కాకుండా గన్నవరం, రాజమండ్రి, విశాఖ ఎయిర్ పోర్టుల్లోనూ శ్రీవారి దర్శనం శ్రీవాణి టికెట్లు జారీ చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వాటిని 3 నెలలకోసారి ఆన్లైన్లో రోజుకు 500 చొప్పున జారీ చేస్తున్నారు. వీటితో పాటు కరెంట్ బుకింగ్‌లో రూ.10,500 చెల్లించి, టికెట్లు పొందే 800 మంది భక్తులకు అదేరోజు సాయంత్రం దర్శనం కల్పిస్తున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 రోజుల్లో 17,48,262 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అత్యధికంగా ఈనెల 16న 91వేల మంది దర్శించుకున్నట్లు చెప్పింది. అలాగే, 3 రోజుల పాటు 90 వేల సంఖ్య దాటగా, 8 సార్లు 80 వేల భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొంది. 22 రోజులకు గానూ హుండీ ఆదాయం రూ.82.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం అష్టమి: ఉ. 9:07 తదుపరి నవమి మఖ: ఉ. 6:51 తదుపరి పుబ్బ వర్జ్యం: మ. 2:47 నుంచి 4:22 వరకు అమృత ఘడియలు: ఉ. 6:04 వరకు తిరిగి రా.12:19 నుంచి 1:54 వరకు దుర్ముహూర్తం: సా.4:39 నుంచి 5:31 వరకు రాహుకాలం: సా 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5:30; సూర్యాస్తమయం: సా.6.23.
AP: తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా TTD అడిషనల్ EO వెంకయ్యచౌదరి మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికి దర్శనానికి చర్యలు చేపడతాం. నిన్న దర్శన సమయం తక్కువగా ఉన్నా.. 79 వేల మంది భక్తులకు దర్శనం కల్పించాం. ఈరోజు అభిషేక సమయంలోనూ 5850 మందికి దర్శనం కల్పిస్తాం. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,603 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.35 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం; శుక్ల పక్షం, షష్టి మ.12:10 వరకు(తదుపరి సప్తమి). పుష్యమి ఉ.8:28(తదుపరి ఆశ్లేష); వర్జ్యం: రా.8:45 నుంచి 10:17 వరక; అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం: ఉ.8:04 నుంచి 8:55 వరకు, తిరిగి మ.12:21 నుంచి 1:13 వరకు; రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు, సూర్యోదయం: ఉ.5:30, సూర్యాస్తమయం: సా: 6:22.
TG: అంత్య పుష్కరాల్లో పోలీసులు ఏఐ డ్రోన్లను వినియోగించి 5 కిలోమీటర్ల వరకు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న 150CC కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూంను PSలో ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం సమస్యలు రాకుండా కాళేశ్వరం 3 వైపులా 250 ఎకరాల్లో 23 పాయింట్లను ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 5:43 గంటలకు పవిత్ర త్రివేణి సంగమంలో తొలి పుష్కర స్నానం ఘనంగా నిర్వహించారు. ఈ మహా పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వాములు ఆచరించగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.