• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,743 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,276 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 13, 2026 / 07:30 AM IST

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 81,288 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వారంతపు సెలవులు, విద్యార్థులకు హాలిడేలు ఉండటంతో భక్తులు భారీగా తరలొస్తున్నారు.

April 12, 2026 / 10:59 AM IST

రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు

AP: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2025-26ల గణనీయంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం, ప్రసాదాల పంపిణీ, ఇలా అన్ని విభాగాల్లోనూ రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. 2025లో సగటున రోజుకు 90వేల నుంచి 95వేల మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

April 12, 2026 / 07:36 AM IST

ఏప్రిల్ 12: ఆదివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం: ఉత్తరాయణం: వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, దశమి: రా. 9-22 తదుపరి ఏకాదశి, శ్రవణ: ఉ. 11-48 తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: మ. 3-58 నుంచి 5-38 వరకు, అమృత ఘడియలు: రా. 1-58 నుంచి 3-38 వరకు, దుర్ముహూర్తం: సా. 4-31 నుంచి 5-20 వరకు, రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు, సూర్యోదయం: ఉ.5.49; సూర్యాస్తమయం: సా.6.10.

April 12, 2026 / 04:35 AM IST

తిరుమల టికెట్ల జారీలో అంతరాయం 

AP: సర్వర్‌లో సమస్య రావడంతో తిరుమల శ్రీవాణి ఆన్‌లైన్ టికెట్ల జారీకి బ్రేక్ పడింది. దీంతో ఆఫ్‌లైన్‌లో కౌంటర్ల ద్వారా సిబ్బంది టికెట్లను జారీ చేస్తున్నారు. రోజుకు 1500 మందికి శ్రీవాణి టికెట్లును ఇస్తున్నారు. ఇందులో 3 నెలల ముందే 500 టికెట్లు, తిరుపతి ఎయిర్‌పోర్టులో ఆఫ్‌లైన్‌లో 200, ఆన్‌లైన్‌లో 800 టికెట్లను TTD జారీ చేస్తోంది.

April 11, 2026 / 03:04 PM IST

ఏప్రిల్ 11: శనివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షంనవమి: రా. 8-42 తదుపరి దశమి, ఉత్తరాషాఢ: ఉ. 10-20 తదుపరి శ్రవణ, వర్జ్యం: మ. 2-34 నుంచి 4-16 వరకు, అమృత ఘడియలు: రా. 12-46 నుంచి 2-28 వరకు, దుర్ముహూర్తం: ఉ. 5-50 నుంచి 7-28 వరకు, రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు, సూర్యోదయం: ఉ.5.50; సూర్యాస్తమయం: సా.6.10.

April 11, 2026 / 04:07 AM IST

ఏప్రిల్ 10: శుక్రవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం: ఉత్తరాయణం: వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, అష్టమి: రా.7-33 తదుపరి నవమి, పూర్వాషాఢ: ఉ. 8-25 తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా. 5-03 నుంచి 6-47 వరకు, అమృత ఘడియలు: తె. 3-25 నుంచి 5-09 వరకు, దుర్ముహూర్తం: ఉ. 8-18 నుంచి 9-08 వరకు, తిరిగి మ. 12-25 నుంచి 1-14 వరకు, రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు, సూర్యోదయం: ఉ5.51; సూర్యాస్తమయం: సా.6.10.

April 10, 2026 / 04:08 AM IST

ఏప్రిల్ 9: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం: ఉత్తరాయణం: వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, సప్తమి: సా.6-00 తదుపరి అష్టమి, మూల: ఉ.6-08 తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.6-08 వరకు, తిరిగి సా.4-39 నుంచి 6-24 వరకు, అమృత ఘడియలు: తె.3-10 నుంచి 4-55 వరకు, దుర్ముహూర్తం: ఉ.9-58 నుంచి 10-47 వరకు తిరిగి మ.2-53 నుంచి 3-42 వరకు, రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు, సూర్యోదయం: ఉ.5.52; సూర్యాస్తమయం: సా.6.10.

April 9, 2026 / 04:25 AM IST

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,232 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 23,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.4.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

April 8, 2026 / 07:55 AM IST

ఏప్రిల్ 8: బుధవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, షష్ఠి: సా.4-07 తదుపరి సప్తమి; మూల: పూర్తి; వర్జ్యం: మ.12-25 నుంచి2-12 వరకు తిరిగి తె.4-23 నుంచి; అమృత ఘడియలు: రా. 11-04 నుంచి 12-50 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-36 నుంచి 12-26 వరకురాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకుసూర్యోదయం: ఉ.5.53; సూర్యాస్తమయం: సా.6.10.

April 8, 2026 / 04:52 AM IST

శ్రీశైల క్షేత్రంలో మహాకుంభోత్సవం

AP: శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంభికా అమ్మవారి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం అమ్మవారికి తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పిస్తారు. సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అన్నాన్ని కుంభరాశిగా పోసి ఆలయ ఉద్యోగి గోవింద్ స్త్రీవేషంలో అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

April 7, 2026 / 10:43 AM IST

శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. స్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.4.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

April 7, 2026 / 07:26 AM IST

ఏప్రిల్ 7: మంగళవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం: ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, పంచమి: మ. 2-04 తదుపరి షష్ఠి, జ్యేష్ఠ: తె. 3-35 తదుపరి మూల, వర్జ్యం: ఉ. 7-10 నుంచి 8-57 వరకు, అమృత ఘడియలు: సా. 5-49 నుంచి 7-35 వరకు, దుర్ముహూర్తం: ఉ. 8-21 నుంచి 9-10 వరకురాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు, సూర్యోదయం: ఉ 5.54; సూర్యాస్తమయం: సా.6.10.

April 7, 2026 / 04:32 AM IST

శ్రీవారి హుండీకి రద్దయిన నోట్లు

AP: తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం TTD వద్ద సుమారు రూ.400 కోట్ల పాత కరెన్సీ పేరుకుపోయింది. దీంతో పాటు బ్యాంకుల్లో మారకపోవడంతో రూ.2 వేల నోట్లను భక్తులు హుండీలో వేస్తున్నారు. వీటిని ప్రతి రెండు నెలలకోసారి చెన్నైలోని RBI కేంద్రంలో మార్పిడి చేస్తున్నట్లు డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

April 6, 2026 / 11:28 PM IST

బాసర అమ్మవారి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి

TG: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు మంత్రులు, ఆలయ అధికారులు సీఎంకు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో పూజారులు రేవంత్ రెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సీఎం రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీపీ చీఫ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 12:21 PM IST