• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

శ్రీవారి దర్శనం.. టికెట్ల విడుదల తేదీలివే

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 2026 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటా టికెట్ల విడుదల తేదీలు వచ్చాయి. మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 22న ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

December 15, 2025 / 08:18 PM IST

ముగిసిన భవానీ దీక్షల విరమణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రీపై పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగిసింది. ఈ 5 రోజుల్లోనే దుర్గమ్మను 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భవానీలు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

December 15, 2025 / 12:37 PM IST

అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

VSP: సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.

December 15, 2025 / 10:10 AM IST

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజూ దాదాపు 80 వేల మంతి భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని, ఈ సీజన్‌లో ఇప్పటికే 24 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

December 15, 2025 / 08:27 AM IST

ఇంద్రకీలాద్రి వెళ్లే భక్తులకు అలర్ట్

AP: ఇవాళ్టి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఉ.6 గం.లకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉ. 7 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గం.ల వరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు.

December 11, 2025 / 06:44 AM IST

ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: TTD

AP: డిసెంబరు, జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం), 29న (వైకుంఠ ఏకాదశి ముందు రోజు), డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు), జనవరి 25 (రథ సప్తమి) రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది.

December 10, 2025 / 08:17 PM IST

శబరిమల 18 మెట్లు ఏం సూచిస్తాయి?

శబరిమలలోని 18 మెట్లు లోతైన ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉన్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను అదుపు చేయాలని సూచిస్తాయి. తర్వాతి 8 మెట్లు కామం, కోపం వంటి 8 రాగద్వేషాలను త్యజించాలనే భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఆపై వచ్చే 3 మెట్లు త్రిగుణాల(సత్త్వ, రజో, తమో)కు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు సూచికగా నిలుస్తాయి. ఈ మొత్తం మెట్లు మనిషి సరైన మార్గంలో నడవాలనే సందేశాన్నిస్తాయి.

December 10, 2025 / 12:37 PM IST

తిరుమలలో బయటపడ్డ మరో స్కాం

AP: తిరుమలలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. వేద ఆశీర్వచ పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టు వస్రాల కొనుగోలులో భారీ మోసం జరిగినట్లు టీటీడీ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ రూ.100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని రూ.1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా మొత్తం రూ.54 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించింది.

December 10, 2025 / 09:21 AM IST

డిసెంబర్ 09: మంగళవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళపక్షం; పంచమి: రా. 8-01 తదుపరి షష్ఠి; పుష్యమి: ఉ. 8-34 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: రా. 9-06 నుంచి 10-40 వరకు; అమృత ఘడియలు: లేవు; దుర్ముహూర్తం: ఉ.8-33 నుంచి 9-17 వరకు; తిరిగి రా.10-33 నుంచి 11-26 వరకు; రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు; సూర్యోదయం: ఉ.6.22; సూర్యాస్తమయం: సా.5.22

December 9, 2025 / 02:15 AM IST

సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి హోమం

HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించనున్నారు. సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు, ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి ఒక ప్రకటనలో తెలియజేశారు. భక్తులు పాల్గొని, గణపతి కృపను పొందగలరని కోరారు.

December 8, 2025 / 02:51 PM IST

8న భద్రాచలంలో భద్రగిరి ప్రదక్షిణ

SDPT: ఈ నెల 8న శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ విషయాన్ని గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు, భకరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు శనివారం తెలిపారు. ఈ దైవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

December 6, 2025 / 07:04 PM IST

గబ్బిలాలను దైవంగా కొలిచే గ్రామం

బీహార్ వైశాలీ జిల్లాలోని సర్సాయ్‌ గ్రామం గబ్బిలాల సంరక్షణకు పేరుగాంచింది. ఇక్కడి చెట్లపై లక్షల గబ్బిలాలు నివసిస్తాయి. వీటిని గ్రామ సంరక్షకులుగా కొలిచే స్థానికులు నీళ్లు పెట్టడమే కాక, వాటికి ఎవరైనా హాని చేస్తే జరిమానాలు విధిస్తూ ఉంటారు. గ్రామస్థులు జబ్బు పడినా త్వరగా నయం కావాలని వీటినే ప్రార్థిస్తారు. విశ్వాసం, పర్యావరణ రక్షణ కలగలిసిన సంప్రదాయంగా పాటిస్తున్నారు.

December 5, 2025 / 11:14 AM IST

ఆన్‌లైన్‌లో ‘తిరుమల శ్రీవాణి’ ద్వారదర్శన టికెట్లు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనాలకు శ్రీవాణి కోటా టికెట్లు అన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. జనవరి 2 – 8 తేదీలకు గాను రోజుకు 1000 చొప్పున 7 వేల టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. కాగా DEC 30, 31, JAN 1కి సంబంధించిన టికెట్లను ఈ-డిప్ ద్వారా కేటాయించిన సంగతి తెలిసిందే.

December 5, 2025 / 10:26 AM IST

డిసెంబర్ 05: శుక్రవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళపక్షం పాడ్యమి: తె. 3-04 తదుపరి విదియ; రోహిణి: మ. 1-34 తదుపరి మృగశిర; వర్జ్యం: ఉ. 7-35 వరకు; తిరిగి రా. 6-47 నుంచి 8-17 వరకు; అమృత ఘడియలు: ఉ. 10-35 నుంచి 12-04 వరకు; తిరిగి తె. 3-45 నుంచి 5-15 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-32 నుంచి 9-16 వరకు; తిరిగి మ. 12-12 నుంచి 12-56 వరకు; […]

December 5, 2025 / 01:15 AM IST

శ్రీవారి గరుడ సేవ రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ నిర్వహించాల్సిన గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో టీటీడీ కార్తీక దీపోత్సవం నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు సమర్పించనున్నారు. కార్తీక దీపోత్సవం కారణంగా భక్తుల సౌకర్యార్థం గరుడ సేవ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

December 4, 2025 / 06:28 AM IST