• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

సింహాచలంలో ముగిసిన చందనోత్సవం

AP: విశాఖపట్నం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం వైభవంగా ముగిసింది. నిజరూపం నుంచి నిత్యరూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం, స్థానిక ఉన్నతాధికారులతో ఇప్పటికే మంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహించిన విషయం విదితమే.

April 21, 2026 / 09:50 AM IST

శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,084 మంది భక్తులు దర్శించుకోగా.. 28,929 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 21, 2026 / 07:36 AM IST

ఏలినాటి శని అంటే ఏమిటి..?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏలినాటి శని అంటే ఒక వ్యక్తి చంద్రరాశికి 12, 1, 2 స్థానాల్లో శనిగ్రహం సంచరించే 7.5 సంవత్సరాల కాలం. ఇది జీవితంలో ఒత్తిడి, అడ్డంకులు, ఆర్థిక నష్టాలు, ముఖ్యమైన మార్పులను తెస్తుందని నమ్ముతారు. దీనినే ‘సాడే సతి’ అని కూడా పిలుస్తారు. దీనికి శనివారం రోజున శని దేవునికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు చెబుతున్నారు.

April 20, 2026 / 03:14 PM IST

విజయకీలాద్రిపై విఘ్నవిమోచక హనుమాన్ మహోత్సవం

AP: విజయవాడలోని విజయకీలాద్రిపై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీవిఘ్నవిమోచక హనుమాన్‌కు మహోత్సవం నిర్వహిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.

April 20, 2026 / 10:57 AM IST

‘సన్నిధి గొల్ల’ వివాదం వార్తల్ని ఖండించిన TTD

AP: అప్పలాయగుంట ఆలయంలో ‘సన్నిధి గొల్ల’కు తొలి దర్శనం దూరం అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. ఆ ఆలయంలో అసలు ఆ పదవే లేదని, వార్తల్లో ఉన్న వ్యక్తి కేవలం ఒక కాంట్రాక్ట్ వర్కర్ మాత్రమేనని స్పష్టం చేసింది. భక్తుల ఫిర్యాదుల మేరకే సదరు వ్యక్తిని కాంట్రాక్టర్ తొలగించారని, విజిలెన్స్ అధికారులు నిర్బంధించారన్నది అవాస్తవమని ప్రకటనలో తెలిపింది.

April 19, 2026 / 09:13 PM IST

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

TG: యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి గంట సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అలాగే కొండకింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో దర్శనమార్గాల్లో తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

April 19, 2026 / 12:41 PM IST

నేటి నుంచి చార్ ధామ్ యాత్ర

ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ఇవాళ్టి నుంచి చార్ ధామ్ యాత్ర సందడి మొదలుకానుంది. అక్షయ తృతీయ సందర్బంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి.  ఈ నెల 22న కేదార్‌నాథ్ ఆలయం, 23న ఉదయం 6:15 గంటలకు బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారుల వెల్లడించారు.

April 19, 2026 / 07:39 AM IST

అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులు కొనొద్దు!

అక్షయ తృతీయ నాడు ఇనుముతో చేసిన వస్తువులను కొనడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. ఇవి ఇంట్లో గొడవలకు, అశాంతికి దారితీస్తాయని నమ్ముతారు. పాత వస్తువులను, ఇతరులు వాడిన వస్తువులను కూడా కొనడం, తీసుకోవడం శుభప్రదం కాదని పండితులు సూచిస్తున్నారు. అలాగే, నలుపు రంగు దుస్తులు కొనడం, ధరించడం నిషిద్ధం.

April 18, 2026 / 07:42 AM IST

25 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమలలో ఈ నెల 25-27 తేదీల్లో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. తొలి రోజు మలయప్పస్వామి వారు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, మూడో రోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. అటు ఉభయ దేవేరులు ప్రత్యేక పల్లకిల్లో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆపై కళ్యాణమహోత్సవం కన్నుల పండుగగా జరగనుంది.

April 17, 2026 / 07:16 AM IST

నేడు ఆన్‌లైన్‌లోనే అప్పన్న స్వామి టికెట్లు

సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాల భక్తులకు సైతం అప్పన్న స్వామి నిజరూప దర్శనం టికెట్లు లభించాలన్న లక్ష్యంతో ఇవాళ ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లను విక్రయించనుంది. భక్తులు chandanotsavam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చని సూచించారు. 9552300009 నంబర్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

April 17, 2026 / 06:22 AM IST

ఏప్రిల్ 25 నుంచి పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల కొండపై పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. నారాయణగిరి ఉద్యాన వనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 25న మలయప్ప స్వామివారి గజవాహన సేవ, 26న అశ్వవాహన సేవ, 27న గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు.

April 16, 2026 / 12:55 PM IST

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,426 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 15, 2026 / 08:15 AM IST

మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

AP: వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి, వైకుంఠ ఏకాదశి తరహా నమూనాను అమలు చేయాలని భావిస్తోంది. దీంతో వెయిటింగ్ టైం 23 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుందని అధికారుల అంచనా. తద్వారా రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు.

April 14, 2026 / 07:58 AM IST

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.  కంపార్టుమెంట్లన్నీ నిండి భక్తులు వెలుపలో క్యూలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 72,724 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,786 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 14, 2026 / 07:57 AM IST

ఏప్రిల్ 14: మంగళవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం వర్జ్యం: రా. 7-42 నుంచి 9-18 గంటలుఅమృత ఘడియలు: ఉ. 5-57 నుంచి 7-35 గంటలుదుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-06 వరకు; తిరిగి రా. 10-50 నుంచి 11-36 గంటలురాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 గంటలుసూర్యోదయం: ఉ.5.49 గంటలుసూర్యాస్తమయం: సా.6.11 గంటలు

April 14, 2026 / 02:56 AM IST