తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి శిలా తోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న 80,350 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,597 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.