MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో మద్యం మత్తులో ఇరువర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకొని ఘటన స్థానానికి వెళ్లారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పస్రా SI తాజుద్దీన్ ఏడుగురు యువకుల పై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడం నేరమని అన్నారు.