KRNL: మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. దీంతో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. తాగి వాహనం నడిపితే కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకుని జైలుకు పంపుతామని ఎస్పీ స్పష్టం చేశారు.