IPL-2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. GTతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో RCB 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 255 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 162 పరుగులకే ఆలౌటైంది. RCB బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, రసీఖ్ ధార్, కృనాల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, మే 31న ఫైనల్ జరగనుంది.