TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఇకపై ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం నెలకు రూ.50 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.