BDK: గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో, ఉన్నత విద్యనభ్యసిస్తున్న అశ్వరావుపేట గిరిజన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో బీ.రాహుల్ ఇవాళ ఉచిత ల్యాప్టాప్లను అందజేశారు. సాంకేతికంగా గిరిజన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.