తొలి క్వాలిఫయర్‌లో ఓటమిపై GT కెప్టెన్ గిల్ స్పందించాడు. ‘ఈ పిచ్‌పై 255 పరుగుల స్కోరు కూడా ఛేదించదగినదే. అయితే, పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, సుదర్శన్ దురదృష్టకర రీతిలో ఔటవ్వడం చూస్తుంటే ఈరోజు మాది కాదనిపించింది. ఇక ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడం మా ఓటమికి ప్రధాన కారణం’ అని తెలిపాడు. ఈ ఓటమిని మర్చిపోయి క్వాలిఫయర్-2 కోసం సిద్ధమవుతామన్నాడు.