GTతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో RCB బ్యాటర్లు పరుగుల వరద పారించారు. 20 ఓవర్లలో RCB 254/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ప్లేఆఫ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో 2023 క్వాలిఫయర్-2లో MIపై GT చేసిన 233/3 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కాగా.. ఇప్పుడు RCB ఆ రికార్డును బ్రేక్ చేసింది.