కాశీలో మరణించిన వారి శరీరాలే కాదు.. ఆత్మలు కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాయని అంటారు. వాళ్లు మళ్లీ జన్మించరు.. జీవులు శాశ్వతంగా లయమయ్యే చోటు అని చెబుతారు. అందుకే ఆ పుణ్యస్థలిని మహా స్మశానం అని అంటారు. ప్రళయకాలంలో ప్రపంచమంతా నశించినా మహా స్మశానమైన కాశీ మాత్రం స్థిరంగా ఉంటుందని పురణాలు పేర్కొన్నాయి. అందుకే కాశీకి క్రాంతి క్షేత్రమని పేరు.