NRPT: ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. SI సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను వివరించారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.