TGPSC మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. R&B శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వయోపరిమితి 18-44 ఏళ్లు. అర్హులైన అభ్యర్థులు జూన్ 6 నుంచి జులై 17 వరకు ఆయా పోస్టులను బట్టి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.