KNR: జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సభల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు పంట మార్పిడి, నానో యూరియా వినియోగం, మొక్కల పెంపకం,తాగునీటి పరిరక్షణ, తదితర అంశాలపై చర్చించారు.