TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని నక్కల కాలువ వంతెన మట్టి కోతతో దెబ్బతిని కూలిపోయే ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ నేత తలపా దామోదరం రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుండటంతో, వెంటనే మరమ్మత్తులు చేపట్టి ప్రమాదం నివారించాలని అధికారులను కోరారు. పురపాలక కమిషనర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.