విశాఖ పెందుర్తి జోన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు జీవీఎంసీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మంగళవారం 95వ వార్డు ఎన్ఏడీ కాలనీ పార్కు, ఓ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్లాస్టిక్ బాటిళ్లు ఇచ్చిన వారికి వస్త్ర సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని జోనల్ కమిషనర్ హెచ్. శంకరరావు తెలిపారు.