AP: లేటరైట్ మైన్ వర్గీకరణలో మార్పులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అల్యూమినియం శాతం 20, అంతకంటే ఎక్కువైతే బాక్సైట్‌గా చూడాలని ఇటీవల కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీని వల్ల APలో గనుల లీజు ప్రక్రియ ఆగిపోయిందని లేఖలో సీఎం ప్రస్తావించారు. 402 గనుల లీజు దరఖాస్తులను హోల్డ్‌లో పెట్టామని, కేంద్రం నిర్ణయాన్ని మరోసారి పున:పరిశీలించాలని సీఎం కోరారు.