ప్రకాశం: సంగం మండలం పరిధిలోని కండ్రిక గ్రామ సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమయింది. కాలువలో మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.