ఎండల నుంచి ఉపశమనం ఇచ్చే అమృతం గుల్కంద్. రోజా పూల రెక్కలు, చక్కెర లేదా కలకండతో చేసే ఈ సాంప్రదాయ స్వీట్ వేసవి తాపాన్ని అద్భుతంగా తగ్గిస్తుంది. ఇది సహజ శీతలీకరణిగా పనిచేస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎసిడిటీ, గ్యాస్, నోటి పూతలను నివారిస్తుంది. చర్మ కాంతిని పెంచి, అలసటను దూరం చేస్తుంది. రోజుకు ఒక చెంచా గుల్కంద్ తింటే ఈ ఎండల్లో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.