NZB: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వర్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గం సభ్యులు త్రివర్ణ పతాకం రంగులో ఉన్న కేక్ కట్ చేశారు. జాతీయ జెండా రంగులో ఉన్న కేకును కట్ చేయడం వివాదాస్పదంగా మారింది. జాతీయ జెండాను కట్ చేసి అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.