ASF: కెరమెరిలో BJP మండల అధ్యక్షుడు తుకారాం మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. CM రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన పర్యటనలో PM జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా ప్రచారం చేశారని ఆరోపించారు. PM జన్మన్ ద్వారా ఆదివాసీలకు తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.