MBNR: షాద్‌నగర్ బస్టాండ్‌లో విజిలెన్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకుల సిద్ధప్పకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. డిపో మేనేజర్ ఉషా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. బస్టాండ్‌లో జేబుదొంగలు, మొబైల్స్, బంగారు ఆభరణాల దొంగలను పట్టుకోవడంలో సిద్ధప్ప కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆయన నిఘా కారణంగానే చోరీలు తగ్గాయని కొనియాడారు.