SDPT: ప్రపంచ యోగాసన పోటీలకు టెక్నికల్ అఫీషియల్ జడ్జిగా సిద్దిపేటకు చెందిన యోగా గురువు తోట సతీశ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణరావుపేటలో పని చేస్తున్నారు. జూన్ 4 నుంచి 8 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన ఎంపిక కావడం విశేషం.