ADB: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. విధి నిర్వహణలో ఇటీవల పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను ఎస్పీ సంబంధిత సిబ్బందితో కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలు అందించిన అధికారులు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.