హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(WPI) బేస్ ఇయర్‌ను 2011-12 నుంచి 2022-23కు మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు DPIIT ఈ కొత్త సిరీస్‌ను విడుదల చేయనుంది. దీనితో పాటు కొత్త ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్(PPI) కూడా విడుదల కానుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ధరల లెక్కింపును మరింత శాస్త్రీయంగా, బలోపేతంగా మార్చనుంది.