ATP: గుత్తి రైల్వేస్టేషన్ సమీపంలో యశ్వంత్పూర్ నుంచి కటిక హార్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలు వెళుతున్న సమయంలో స్క్రూ జాయింట్ కప్లింగ్ ఊడిపోయి రైలు ఇంజన్ నుంచి S-6, S-7 బోగీలు ఉడిపోయాయి. గమనించిన లోకో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. అధికారులు ఊడిపోయిన భోగిలకు మరమ్మత్తులు చేపట్టడంతో రైలు అరగంట పాటు ఆలస్యంగా వెళ్లింది.