JGL: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రతిష్ఠాత్మక “సేవా పథకం”లకు జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. ఎంపికైన వారిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీతో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని ఆయన అన్నారు.