TGలో ‘పెద్ది’ మూవీకి ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ 4న విడుదల కానున్న ఈ మూవీ తొలిరోజు కేవలం ఒకే ఒక్క ప్రీమియర్ షోకు మాత్రమే ఈ అనుమతి లభించిందట. ఈ ప్రీమియర్ షో గరిష్ట టికెట్ ధర రూ.600గా నిర్ణయించినట్లు టాక్. అలాగే, వారం రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.100 అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందని సమాచారం.