ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో నూతన డీజీపీగా నియమితులై, భాద్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డికి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరు పలు అంశాలపై చర్చించారు.
‘హత్య’ సినిమా నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత, రైటర్‌పై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మాజీ MP వివేకానంద హత్యకి సంబంధించిన విషయాలను ఆధారంగా చేసుకుని సినిమాగా చేశారు. అయితే ఇప్పుడు నిజ జీవితంలో కేసు విచారణను ఎదుర్కొంటోన్న సునీల్ ఈ మూవీపై కేసు వేశాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక లవ్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పారు. ఆ పాటకు AR రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయేలా ఉంటుందని, ఇది మన మనసును తాకే మెలోడీగా నిలుస్తుందని తెలిపారు. ఇక ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కాబోతుంది.
ప్రేక్షకులను అలరిస్తోన్న తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 9పై HYD బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందని ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండ్ తెలిపారు. మహేష్ అంటే ఎంతో అభిమానమని, ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా మంచి ప్రేమకథా మూవీని తెరకెక్కిస్తానని చెప్పారు. అది కూడా ఇప్పటివరకు ఆయన చేసిన మూవీలకు భిన్నంగా, కొత్త నేపథ్యం మీద సాగేలా చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే రోజు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఉండనుంది. ఆయన సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘రాజాసాబ్’ నుంచి పాట రాబోతుంది. అలాగే ‘ఫౌజీ’ నుంచి టీజర్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ‘పౌర్ణమి’ ఈ నెల 23న, ‘బాహుబలి ది ఎపిక్’ ఈ నెల 31న రీ-రిలీజ్ కానున్నాయి.
కన్నడ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘KGF 1,2’ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. త్వరలోనే ‘KGF 3’ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన మూవీ ‘జాట్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. తాజాగా మేకర్స్.. దీనికి సీక్వెల్ ప్రకటించారు. అయితే దర్శకుడు గోపీచంద్ ఈ అందుబాటులో ఉంటే ఆయనే ఈ మూవీని తెరకెక్కిస్తారని, లేదంటే మరో దర్శకుడితో ముందుకెళ్తామని అన్నారు.
ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక నటించిన ‘మిత్రమండలి’ ఈ రోజు విడుదలైంది. కుల బలంతో MLA కావాలనుకుంటున్న నారాయణ కూతురు స్వేచ్ఛ పారిపోతుంది. ఆమె పారిపోవడానికి సాయం చేసిన కుర్రాళ్లు నారాయణ నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేదే కథ. కామెడీ ట్రై చేశారు కానీ అక్కడక్కడా నవ్వించింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ పర్వాలేదు. రేటింగ్ 1.75/5.
ప్రముఖ నటి హన్సిక మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా హన్సిక తన భర్త సోహైల్‌కు దూరంగా తన తల్లితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వస్తున్నాయి. మరోవైపు హన్సిక సోదరుడి భార్య హన్సిక, ఆమె తల్లి తమను గృహహింసకు గురిచేశారని కేసు పెట్టింది. ఈ కారణాలతోనే ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభించగా.. ‘బుక్‌మైషో’, ‘డిస్ట్రిక్ట్’ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో బుక్ చేసుకోవచ్చు. మరోవైపు ‘డ్యూడ్ స్వాగ్’ ఈవెంట్ ఇవాళ HYDలోని ITCకోహినూర్‌లో సా. 6 గంటలకు ప్రారంభ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పౌర్ణమి’. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న ఇది రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో త్రిష, ఛార్మి కథానాయికలుగా నటించారు.
తొలి తెలుగు మహిళా సింగర్, నటి బాలసరస్వతి(97) కన్నుమూశారు. ఆమె మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. బాలసరస్వతి మృతి తనని ఎంతగానో కలచివేసిందన్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటి, సింగర్‌గా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. బాలసరస్వతి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేరొన్నారు.
మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు కలిసి నటించిన మూవీ ‘దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ’. SEPలో రిలీజైన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వంత్ దుద్దుంపూడి, చిత్ర శుక్ల, సముద్రఖని, మహేష్, మలయాళ నటుడు సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనుమతి లేకుండా ఆయన ఫొటోలు వాడొద్దని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. వెంటనే ఇ-కామర్స్ సైట్లలోని ఆయన ఫొటోలను తొలగించాలని ఆదేశించింది. అయితే, ఫ్యాన్స్ పేజీలు, ఇన్‌స్టాలో హృతిక్ ఫొటోలు, వాయిస్ వాడడంపై చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చుతూ, అభిమానుల పేజీలకు ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది.