ఓ పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలతో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంపై శిల్పా దంపతులకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరూ తరచూ విదేశాలకు వెళ్తుండటంతో ఈ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు’ మూవీ రాబోతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు జరగనున్న ఈ షూటింగ్లో రెండు పాటలను షూట్ చేయనున్నట్లు చెప్పారు. 2026 సంక్రాంతికి ఈ మూవీతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న మూవీ ‘ప్యారడైజ్’. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవిని అతిథి పాత్రలో తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఆయన కోసం మేకర్స్ స్పెషల్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే వారు చిరును సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ అమ్మాయి లెజెండ్‌గా ఎలా మారిందనేది ‘ఘాటీ’ కథ. శీలావతి పాత్రలో నటించిన అనుష్క డైలాగ్స్‌తో పాటు ఫైట్స్‌తో అదరగొట్టారు. చైతన్యరావు, విక్రమ్ ప్రభుల నటన బాగుంది. సినిమాటోగ్రఫీ. BGM మూవీకి ప్లస్. ఎమోషన్స్ లేకపోవడం, ఫస్టాఫ్‌లో కాస్త సాగదీత, కథ పెద్దగా లేకపోవడం మైనస్. రేటింగ్:2.5/5.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కిష్కింధపురి’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ చిత్రం 2:05 గంటల నిడివితో రాబోతుంది. కాగా కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు.
కన్నడ హీరో రిషబ్ శెట్టిపై స్టంట్ మాస్టర్ అర్జున్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ‘కాంతార 1’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను రిషబ్ స్వయంగా చేశారని, డూప్‌ను ఉపయోగించలేదన్నారు. ఇప్పటివరకు చేయని యాక్షన్ సన్నివేశాలను కూడా డూప్ లేకుండా చేశారని చెప్పారు. తాను ఇప్పటివరకు చాలా మంది నటులతో పని చేశానని, కానీ రిషబ్ లాంటి హీరోను చూడలేదని పేర్కొన్నారు. ఆయన ఎంతో స్ఫూర్తి అని వెల్లడించారు.
‘ది బెంగాల్ ఫైల్స్’ మూవీ విడుదలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటోందని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. అంతేకాదు ప్రభుత్వ ప్రతినిధులు కొందరు థియేటర్ల యాజమాన్యాలను బెదిరిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, 1946 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
తాను ఇప్పటివరకు తన కూతురు రాహా చూసి ఎంజాయ్ చేసే సినిమాలు చేయలేదని బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పారు.అందుకే తను చూసి నవ్వుకునే సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నానని, ఇకపై కామెడీ కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలోనే వాటి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.
నటులు మౌళి తనుజ్, శివాని నాగరం ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈ మూవీ యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ. 2015 నాటి ఇంటర్, ఎంసెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ప్రేక్షకులను అలరిస్తుంది. రొటీన్ కథాంశం అయినప్పటికీ, సరదా సంభాషణలు, స్క్రీన్‌ప్లేతో నవ్వించారు. క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రేటింగ్ 3.5/5.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ లైవ్ యాక్షన్ మూవీ ‘లిలో అండ్ స్టిచ్’ OTTలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీ మే 23న రిలీజై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9123 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించింది. రూ.100లోపు ఉన్న మూవీ టికెట్లపై GSTని తగ్గించింది. వాటిపై ఉన్న 12% GSTని 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 18% GST కొనసాగనుంది. మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం థియేటర్లలపై ప్రభావం లేదు. మరోవైపు సాల్ట్ పాప్‌కార్న్ 5% శ్లాబ్‌లోకి, క్యారమిల్ పాప్‌కార్న్ 18%లోకి వస్తుంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’. ఆగస్టు 14న రిలీజైన ఈ మూవీ పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రం OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఈ నెల 11 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
తనపై ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువాళ్లే అని మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ చెప్పారు. ‘కొత్త లోక’ మూవీ సక్సెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాను భారీ విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత తెలుగువాళ్లను కలవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉందని, కానీ మంచి కథ దొరకడం లేదని తెలిపారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న రిలీజై మంచి హిట్ అందుకుంది. ఇటీవల సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఈ మూవీ OTTలోకి రాలేదు. దీంతో నెటిజన్లు.. ఈ మూవీ OTTలోకి ఇంకా రాలేదు ఏంటంటూ?.. చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
TG: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో హీరో రాజ్‌తరుణ్‌పై మరో కేసు నమోదైంది. రాజ్‌తరుణ్ తన కుక్కను చంపేశాడని లావణ్య ఫిర్యాదు చేసింది. తన తండ్రిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారని ఆరోపించింది. కాగా ఇప్పటికే రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.