లాస్ ఏంజెలెస్‌లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ‘ఫ్రాంకిన్‌స్టన్’ చిత్రం కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ & హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో 2 అవార్డులను కైవసం చేసుకుంది. ఎమీ మాడిగన్(వెపన్స్) ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ‘కెపాప్ డెమన్ హంట్స్’, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ‘ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్’ అవార్డును గెలుచుకున్నాయి.