నాగర్కర్నూల్ పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ నిజాం ఆధ్వర్యంలో స్థానిక మదర్సాలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహనం, సేవాభావం ఈ మాసం గొప్పతనమని అన్నారు.