BDK: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. పేదలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ స్థాయి చికిత్సలు అందించడం శుభపరిణామమని అన్నారు. ప్రభుత్వ వైద్యుల నిబద్ధతను ప్రతి ఒక్కరూ అభినందించాలని పేర్కొన్నారు.