PLD: కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. బుధవారం అమరావతి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు. ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించడంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.