మనిషిని లోపల నుంచి నిరంతరం బాధించి, కుంగదీసే రెండు మానసిక ముళ్లు ఉన్నాయని విదురుడు చెప్పాడు. పేదవాడై ఉండి విలాసాలు కోరుకోవడం, తన స్తోమతకు మించి గొప్పల కోసం ఆరాటపడటం. బలహీనుడై ఉండి కోపగించుకోవడం.. ఎదుటివారిని ఏమీ చేయలేని అశక్తతలో ఉండి కూడా, అనవసరంగా ప్రతిదానికీ కోపంతో రగిలిపోవడం. ఈ రెండు లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరని విదుర నీతి సారాంశం.