TPT: మే 12న నిర్వహించనున్న జపాలి హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. తుడా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అర్చకులు వేదాశీర్వచనం అందించి ఆహ్వాన పత్రికను సమర్పించారు. జపాలి తీర్థం, పాపవినాశనం క్షేత్రాల్లో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా కోరారు.