KMM: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఈర్లపూడిలో నిర్వహించిన మదన్ లాల్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మదన్ లాల్ నిబద్ధత గల నాయకుడని, ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.