కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వర రావు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. 36 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.18,92,187 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎంకేటి నాగ వర ప్రసాద్ తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, సహాయకులు పాల్గొన్నారు.