TG: ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేబినెట్లో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా గిరిజన నేతకు అవకాశం దక్కనుందని టాక్ వినిపిస్తోంది.