NZB: జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం గ్రామస్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం జరగనున్న ఈ వేడుకకు భారీగా భక్తులు తరలిరానున్నారు. గ్రామమంతా భక్తి భావంతో పులకించిపోతోంది.