SKLM: అసమానతలున్న చోట ఉద్యమాలు సహజం అని, అరెస్టులు, నిర్బంధాలతో విప్లవోద్యమం ఆగదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. నరసన్నపేట మండలం కోమర్తిలో కామ్రేడ్ మామిడి అప్పసూరి 29వ వర్ధంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమొక్రటిక్ పార్టీ సభ్యులు నీలం రాజు, తదితరులు పాల్గొన్నారు.