AP: తిరుమలలో CM చంద్రబాబు చేతుల మీదుగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ప్రారంభించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. FSSAIతో 2024లో ప్రభుత్వం MOU చేసుకుందని పేర్కొన్నారు. కొద్దికాలం వ్యవధిలోనే ల్యాబ్ ప్రారంభించామని వివరించారు. ఇందులో పాలు, నెయ్యి, నూనెతోపాటు ముడి సరకుల నాణ్యత తెలుసుకోవచ్చన్నారు.